తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

by Ramesh N |
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గున మండుతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు మారాయి. గత వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం 11 గంటలు దాటితే రోడ్లపైకి జనాలు రావడం తగ్గింది. అయితే రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న 3 రోజులు వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed