ఆలయంలో హుండీ చోరీ.. అరిష్టం అంటోన్న గ్రామస్తులు

by Gantepaka Srikanth |
ఆలయంలో హుండీ చోరీ.. అరిష్టం అంటోన్న గ్రామస్తులు
X

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామ శివారులోని అతి పురాతనమైన శైవక్షేత్రం, మినీ కాశీగా పేరుగాంచిన శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీ పైభాగం పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారని అర్చకులు జై కిషన్ మహరాజ్, శివ స్వామి తెలిపారు. అతి పురాతనమైన పనవాటి లింగం పెకిలించడంతో ఏదైనా అరిష్టం జరుగుతుందో అని గ్రామస్థులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ఉదయం ఆలయానికి వచ్చి చూడగా ఆలయంలో ఉన్న హుండీ పైభాగం పగలగొట్టి ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కంగ్టి ఎస్ఐ విజయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. గతంలో 3,4 సార్లు ఆలయంలో హుండీ చోరీ జరగడంతో గ్రామస్తులు ఇటీవల ఆలయ ఈఓ, పాలక వర్గానికి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని చెప్పిన వారం రోజులకే చోరీ యత్నం జరగడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed