- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC : ఐసీసీ టాప్ ర్యాంకులో బూమ్రా
దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ(ICC Ranks) తాజాగా ప్రకటించిన టెస్టు క్రికెట్ ర్యాంకుల్లో భారత స్టార్ పేసర్ జస్పీత్ బూమ్రా టాప్ ర్యాంకర్ గా కొనసాగుతున్నారు. టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో బూమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం బుమ్రా 890 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండగా..దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ 856 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (797 పాయింట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ తో అడిలైడ్ టెస్టులో మాత్రమే అతడు ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కాకుండా రవీంద్ర జడేజా (786) భారత్ తరపున టాప్-10లో ఉన్నారు.
బ్యాటర్లలో నెంబర్ వన్ జోరూట్
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో జో రూట్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓడినప్పటికీ.. రూట్ సెంచరీతో రాణించడంతో సహచరుడు హ్యారీ బ్రూక్ (876)ను వెనక్కినెట్టి (895) నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. టాప్-10లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (811), రిషబ్ పంత్ (724) మాత్రమే ఉన్నారు.
ఇక టెస్టు ఫార్మాట్ ఆల్ రౌండర్ల జాబితాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ టాప్ -10లో చోటు దక్కించుకున్నారు. జడేజా (415) పాయింట్లతో టాప్ వన్ లో ఉండగా, అశ్విన్ (283) మూడో స్థానం, అక్షర్ పటేల్ (234) పదో స్థానంలో నిలిచారు. టీ20 బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (855), ఫిల్ సాల్ట్ (829), తిలక్ వర్మ (806), సూర్యకుమార్ యాదవ్ (788), జోస్ బట్లర్ (717) టాప్ -5లో కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో విండీస్ ఆటగాడు అకీల్ హుసేన్ (707) మూడు స్థానాలను ఎగబాకి అగ్రస్థానంలోకి వచ్చాడు. భారత్ నుంచి ఆరో స్థానంలో రవి బిష్ణయ్ (666), ఎనిమిదవ స్థానంలో అర్షదీప్ సింగ్(656) పాయింట్లతో కొనసాగుతున్నారు.