రూ.15 లక్షలు పోసినా దక్కని ప్రాణం.. గుండెలు బాదుకుంటున్న పేరెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-20 07:10:34.0  )
రూ.15 లక్షలు పోసినా దక్కని ప్రాణం.. గుండెలు బాదుకుంటున్న పేరెంట్స్
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూ బారినపడి బీటెక్ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మిర్యాల శ్రీనివాసులు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ సమీపంలో నివాసం నివాసం ఉంటున్నారు. తన రెండో కూతురు నికిత(21) హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది. నెల రోజుల క్రితం సెలవులపై ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా ప్లేట్‌లేట్స్ కౌంట్ తగ్గిందని డెంగ్యూ లక్షణాలున్నట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పది రోజులపాటు చికిత్స తీసుకుంది. కాగా సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 15 లక్షల పైగా ఖర్చు చేసినా తమ కూతురు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story