మునుగోడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

by GSrikanth |   ( Updated:2022-10-11 14:08:36.0  )
మునుగోడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు చేసే ఖర్చును రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. అభివృద్ధి ఆమడ దూరంలోని రాష్ట్రంలో సర్కార్‌ పాఠశాలలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ''మునుగోడు ZP School Groundలో యువకులకు ఆడుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఈ స్కూల్ బోర్డు విరిగి చాలా రోజులయిందంటే మన పాలకులకు విద్య మీదున్న శ్రద్ధ ఎంతో మీకర్థమైందనుకుంటున్నా. ఈ పేద ఓటర్లను మాయ చేయడానికి పెడుతున్న సారా-కూర- కార-చీర స్కీంల పైసలు ఈ స్కూలుకు పెట్టండి.'' అంటూ టీఆర్ఎస్, బీజేపీ సర్కార్‌లను ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.



Advertisement

Next Story