- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. నీ వల్ల కాకపోతే గద్దె దిగు: బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇక కాళేశ్వరం కింద ఉన్న అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ముంపు ప్రాంతాలను సరిగ్గా గుర్తించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన భూమికంటే ఎక్కువ ప్రాంతం ముంపుకు గురైందని చెప్పారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. రైతులను గోస పెట్టవద్దని, ఇప్పటికైనా వాళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే గద్దె దిగిపోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.
కెసిఆర్ గారు మీరు గర్వంగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ముంపు ప్రాంతాలను కూడా సరిగా గుర్తించక పోతిరి. మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మీరు సేకరించిన భూమికంటే రెట్టింపు ప్రాంతం ముంపుకు గురవుతోంది. ఈ విషయాన్ని రైతులు మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నది లేదు.… pic.twitter.com/6XvazMYqwL
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 29, 2023