- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BSP చీఫ్ RS Praveen Kumar సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered| తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం స్కీమ్ మరుగున పడిపోయిందని.. ఆశించిన స్థాయిలో ఈ పథకం అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం జరిగిన బహుజన మహిళా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ప్రతినిరుపేద కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అసైన్డ్, పోడు భూములు ఎకరా నుంచి 5 ఎకరాల వరకు మహిళల పేరిట పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టింది. 2014 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. నిజానికి ఈ స్కీమ్ ఎంతో గొప్పదని అంతా భావించినప్పటికీ ఆచరణలో సక్రమంగా అమలు జరగకపోవడం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. తాజా నిరుపేదలందరికీ ఎకరా నుండి 5 ఎకరాల వరకు మహిళలకు పట్టాలిస్తామని RS ప్రవీణ్ కుమార్ ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది.
- Tags
- RS Praveen Kumar