SC వర్గీకరణకు BRS మద్దతు.. ఆ వెంటనే అసెంబ్లీ నుంచి వాకౌట్

by Gantepaka Srikanth |
SC వర్గీకరణకు BRS మద్దతు.. ఆ వెంటనే అసెంబ్లీ నుంచి వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ నుంచి BRS సభ్యులు వాకౌట్ చేశారు. బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసగా వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. అంతకుముందు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2014 నవంబర్‌ 29న కేసీఆర్‌ వర్గీకరణపై తీర్మానం పెట్టారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీవర్గీకరణ అమలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే బీసీ బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసగా వాకౌట్ చేశారు.

అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్‌ వేశామని తెలిపారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉప కులాలను గ్రూప్‌-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్‌ పాయింట్లు, క్రిమీలేయర్‌ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్‌ సిఫారసు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. సమాజంలో తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించాం. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నా అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed