వలసలకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం! తెరపైకి అభ్యర్థుల లిస్ట్‌!

by Ramesh N |
వలసలకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం! తెరపైకి అభ్యర్థుల లిస్ట్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి నాన్ స్టాప్‌గా చేరుతూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ లాంటి తదితర కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు.. కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీతో సహ పార్టీని వీడారు. మరోవైపు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యతో సహా పార్టీని వీడారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

వలసలపై బీఆర్ఎస్ రియాక్షన్

వలసలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ నేతల వలసలను చెక్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి కూతురు అయిన కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ ప్రకటించింది. ఇతర కీలక నేతలను కాదని బీఆర్ఎస్ హైకమాండ్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది.

చెక్‌ పెట్టెందుకు నేతల కౌంటర్లు

నేడు వారు పార్టీకి గుడ్‌‌బై చెప్పడంపై అధిష్టానం గుస్స అయ్యింది. ఇది పార్టీకి భారీ డ్యామెజీగా బీఆర్ఎస్ హై కమాండ్ భావించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్, మెదక్‌ హారీష్ రావు, పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో వలస వెళ్లిన నేతలపై మాటలతో విరుచుకపడ్డారు. జిల్లా క్యాడర్ నుంచి రాష్ట్ర స్థాయి కీలక నేతల వరకు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి పై జిల్లా క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ లో బీఆర్ఎస్ శ్రేణులు కడియం దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

తెరపైకి పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్‌

వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్య తిరస్కరించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో పలువురు సీనియర్ నేతలు ఆ స్థానం పై కన్ను వేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరఫున వరంగల్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పలువురి బీఆర్ఎస్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే మరో కీలక నేత ఇటీవల ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్‌ను వరంగల్ బరిలో ఉంచాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ అధిష్టానం ఎవరికీ కట్టబడుతుందో.. రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story