- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్‌సభలోనూ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కలకలం రేపుతున్న సర్వే ఫలితాలు!
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి షాక్ తగిలేలా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలే మళ్లీ రిపీట్ అయ్యేలా కన్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 సీట్లల్లో మాత్రమే గెలుస్తుందని ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని నివేదిక ఇచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.
బీఆర్ఎస్‌పై ఒత్తిడి!
అసెంబ్లీ ఫలితాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నారు. కాస్త రిలాక్స్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో సన్నాహకాలు రెడీ చేసుకుందామనుకునే సరికి తాజాగా విడుదలైన సర్వే వారికి షాకిచ్చింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
తెలంగాణలో బీజేపీకి కష్టమే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు సంపాదించుకున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో కాస్త నిరాశే ఎదురుకానుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే పేర్కొంది. దేశంలో మాత్రం ఈ సారి కూడా మోడీ ప్రభుత్వమే వస్తుందని సర్వే అభిప్రాయపడింది.
రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్!
ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జోష్‌లో ఉంది. దీంతో పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడ్డారని సర్వే తెలిపింది. రాష్ట్రంలో ఉన్న లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. ఆశావాహులపై ఫోకస్ పెంచింది. పార్టీ అధిష్టానంతో టీ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్‌లో ఉన్నట్లు కన్పిస్తున్నది.