- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సర్కార్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఓవైపు సాగునీటి సంక్షోభం.. ఇంకోవైపు రైతుభరోసా మోసం.. పండుగ వేళ సర్కారు వ్యవసాయాన్ని దండుగలా మార్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని మండిపడ్డారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని అన్నారు. ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం.. ఇంకోవైపు రైతుభరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం అని విమర్శలు చేశారు.
అలాగే రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం వచ్చిందని తెలిపారు. అంతేగాక వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదని, ముఖ్యమంత్రికి సోయి, ప్రభుత్వానికి బాధ్యత లేవని పలు ఆరోపణలు చేశారు. ఇక దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎం రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదని చెప్పారు. అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ముంచే రోజులు పోయి, మళ్లీ మంచిరోజులొస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.