BRS: ఈ ఘటనతో రేవంత్ రెడ్డి నిజరూపం బయటపడింది.. కేటీఆర్ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
BRS: ఈ ఘటనతో రేవంత్ రెడ్డి నిజరూపం బయటపడింది.. కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిజరూపం బయటపడిందని, ఇకనైనా వారిపై పెట్టిన కేసులు రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. లగచర్ల ఘటన(Lagacharla Incident)లో అరెస్టైన వారికి బేడీలు వేయడంపై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట..

జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనట.. వారి కుటుంబసభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట అని చెప్పారు. అలాగే నెల రోజులుగా వారికి చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఒకేనట.. గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ఒకేనట అని దుయ్యబట్టారు. అంతేగాక చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న రేవంత్, నీ నిజరూపం రాష్ట్రంలోని పేదలందరికి తెలిసిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా క్షమాపణ చెప్పి కేసులు రద్దు చెయ్యాలని, రైతులను విడుదల చెయ్యాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed