- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ జెండాలపై కొత్త భాషలు.. కేసీఆర్ తీరుతో BRS నేతల్లో కొత్త టెన్షన్..!
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని భాషల్లో పార్టీ కండువాలను తయారు చేయించారు. ఏ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడితే ఆ భాషనే కండువాలపై ముద్రించారు. గులాబీ కలర్‌పై ప్రాంతీయ భాషలు, దేశ మ్యాప్‌తో ముద్రించారు. ఒడిశా వారు బీఆర్ఎస్‌లో చేరగా వారికి వారి భాషలోనే కండువాలను తయారు చేయించారు. పార్టీ బ్యానర్లలో తెలుగు మాయం అయింది. కేవలం హిందీ, ఇంగ్లీషు భాషను మాత్రమే పార్టీ బ్యానర్లలో ముద్రించారు. ఇప్పటికే తెలంగాణ పదం, మ్యాప్ గయాబ్ కావడంతో బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలు ఎటుదారీ తీస్తాయోనని ఆందోళన మొదలైంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు చర్యలు చేపట్టిన పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీలో చేరే వారికోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అందులో భాగంగానే పార్టీ కండువాలను సైతం అన్ని రాష్ట్రాల్లో మాట్లాడే భాషలతో కండువాలు, ఆయా రాష్ట్రాల లిపిలో బీఆర్ఎస్ జెండాలను తయారు చేయించారు. కండువాలు, జెండాలను గులాబీ కలర్‌పైనే ప్రాంతీయ భాషలను ముద్రించారు. ఏ రాష్ట్రం వారు బీఆర్ఎస్ లో చేరితే వారికి ఆ కండువాలు కప్పేందుకు సిద్ధం చేశారు. అంతేకాదు స్వాగతం పలికేందుకు బ్యానర్లను సైతం కడుతున్నారు. అంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడే అన్న చందంగా మారింది కేసీఆర్ పరిస్థితి. బీఆర్ఎస్‌లో చేరిన ఒడిశా నేతలకు ఒరియా భాషలో ముద్రించిన కండువాలను కేసీఆర్ కప్పారు. అంతేకాదు బ్యానర్లు సైతం వారి భాషలోనే ఏర్పాటు చేయించడం గమనార్హం.
బ్యానర్లలో తెలుగు మాయం..
టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అన్ని బ్యానర్లులు తెలుగులో ఉండేది. కండువాలపైన తెలంగాణ రాష్ట సమితి అని తెలుగులో ఉండేది. అంతేకాదు తెలంగాణ మ్యాప్ సైతం ఉండేది. కానీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ మ్యాప్ కనుమరుగైంది. తెలంగాణ భవన్‌లో చేరికలను పురస్కరించుకొని చేసే కార్యక్రమం, పార్టీ కార్యక్రమాల్లోనూ సైతం తెలంగాణ మ్యాప్ కనిపించడం లేదు. అంతేకాదు భవన్‌లో వేదికలపై సైతం హిందీ, ఇంగ్లీషు భాషలు మాత్రమే కనిపిస్తున్నాయి. తెలుగులో కనిపించకుండా పోయింది. అంతేకాదు ఇతర రాష్ట్రాల వారితో సమావేశాలు, చేరికల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లలో ఇతర భాషలు మాత్రమే కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ నేతల్లో డిస్కషన్..
తెలంగాణ నినాదంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. అంతేకాదు రెండుసార్లు కేసీఆర్‌కు రాష్ట్ర అధికారంను సైతం ప్రజలు కట్టబెట్టారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించిన కేసీఆర్ పార్టీ పేరును మార్చడంతో తెలంగాణ పదానికి దూరమయ్యారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తెలంగాణ మ్యాప్ సైతం లేకుండా పోవడం, తాజాగా తెలుగు కూడా బ్యానర్లపై కనబడకపోవడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలాపోవాలి, ఏమని వివరించాలో తెలియడం లేదని నేతలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఈ అంశాలపై ఏ ఇద్దరు నేతలు కలిసినా చర్చించుకుంటుండటం గమనార్హం.
Also Read...
ఫిబ్రవరి 6న తెలంగాణకు ప్రియాంక.. ఇకపై ఆమె కనుసన్నల్లోనే T-కాంగ్రెస్..!