- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: ఆ మంత్రులు ఉన్నా.. లేకున్నా ఒకటే.. రూ. 100 కోట్లు నష్టం: బీఆర్ఎస్
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. దీంతో సమీపంలోని గ్రామాలను వరదలతో ముంచెత్తింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. అని తీవ్ర విమర్శలు చేసింది. ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించింది. దీంతో దాదాపు రూ. 100 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించింది. శాఖల మీద పట్టులేకపోవడం, అనుభవారహిత్యంతో మంత్రులు జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని తెలిపింది.
మొదటి మంత్రి- పేరుకే ఉప ముఖ్యమంత్రి.. ఎవరూ ఆయన్ని పట్టించుకోరు, రెండో మంత్రి- ఆయన ముద్దుపేరు గడియారాల మంత్రి.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ వేడుక జరిగినా గడియారాలు పంచడం ఆయన హాబీ, మూడో మంత్రి- ఈయన శాఖపరమైన మీటింగ్‌లో కూడా ఈయనకు చోటు ఉండదు.. అదే ఆయన స్పెషాలిటీ.. అని విమర్శించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు గేట్ల దగ్గర భారీ గండిపడిందని, దీంతో ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిందని పేర్కొంది. ప్రాజెక్టు గండి పడటం వల్ల గ్రామాల్లోకి నీటితో ముంచెత్తిందని, దీనివల్ల వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించింది. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి కూలిన ఇళ్లు.. వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయని పేర్కొంది. ఇది అసమర్థ కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అని వీడియో షేర్ చేసింది.
Read More..