- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన BRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఎంపీలకు CM KCR కీలక ఆదేశం
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు హాజరయ్యారు. ఎంపీలతో జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక, సమావేశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. అలాగే, గవర్నర్ల వ్యవస్థపై పోరాడాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు రావాల్సిన నిధులపై నిలదీయాలని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలపై ప్రశ్నించాలని ఎంపీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.