- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిర్యాలగూడలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
దిశ, మిర్యాలగూడ టౌన్: పార్లమెంట్ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ దాదాపు 13 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరూ శనివారం కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు తిరునగర్ నాగలక్ష్మీ, మల్గం రమేష్, ఉదయ్ భాస్కర్, పత్తిపాటి సంధ్య, నవాబ్, సలీం, బంటు రమేష్, అమృతం దుర్గ సత్యం, బండ్ల దేవకమ్మ, చీదేళ్ళ సత్యవేణి, సాధిక బేగం, అయోద్య, ఉబ్బపల్లి వెంకమ్మ, కర్ర ఇందిరలు ఉన్నారు. వీరితో పాటు మాజీ మున్సిపాలిటీ ఛైర్మన్ మెరుగు రోషయ్య, మిర్యాలగూడ పీఏసీఎస్ ఛైర్మన్ బంటు శ్రీనివాస్ కూడా ఉన్నారు. 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఛైర్మన్‌తో పాటు 13 మంది ఒకేసారి పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ హోదాను కొల్పోనుంది. ఇదిలా ఉండగా అధికార పార్టీ నాయకులు చేరికలు వద్దని తీర్మానం చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి నేతల సమక్షంలో చేరడంతో ఎలా కలిసి పని చెస్తారనేది వేచి చూడాల్సిందే.