- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరికపై కుండబద్దలు కొట్టిన BRS ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో ఢీలాపడ్డ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు ఒక్కరొక్కరుగా జంప్ అవుతున్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు, 6 గురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం గూటికీ చేరారు. మరి కొందరు సైతం వీరి బాటలోనే పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గా్ల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సైతం బీఆర్ఎస్‌కు టాటా చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వద్దిరాజు రవిచంద్ర రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలో జాయిన్ అవ్వడం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అంతేకాకుండా బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని స్పష్టం చేశారు.
ఇది బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నలుగురు రాజ్య సభ ఎంపీలు కూడా కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని.. కాషాయ పార్టీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహగానాలు వినిపిస్తున్నాయి. స్టేట్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఓ పక్కా కేసుల విచారణ.. మరోపక్కా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి బీఆర్ఎస్‌ను ఖాళీ చేస్తుండటంతో బీజేపీతో కలిసేందుకు గులాబీ సిద్ధమైనట్లు గుసగుసలు వినిపించాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై రవిచంద్ర స్పందించడంతో విలీన వార్తలకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.