- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు: MP రంజిత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: డబ్బు కోసం, పనుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహిత అన్నారు. ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. చేవెళ్లకు వచ్చిన మహేశ్వర్ రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని మండిపడ్డారు.
ఏదైనా అంశంపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. సీతారాంపూర్భూముల వ్యవహారంలో తన పాత్ర లేదన్నారు. తాను అసైన్డ్ భూములు తీసుకున్నట్టు రుజువు చేయగలవా? అని మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. కేటీఆర్ బినామీ అంటూ ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తనకు అసైన్డ్ భూమి ఒక్క ఇంచు ఉందని నిరూపించినా దేనికైనా సిద్ధమేనన్నారు.