- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MP Candidates: ఆ రెండు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఫిక్స్.. తెరపైకి మాజీ మంత్రి పేరు!
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శనివారం ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి రాష్ట్రంలో పోటీ చేసే 9 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించిన సంగతి విధితమే. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదర్కొని మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. ఆ విషయం అటుంచితే ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ విషయంలో కాస్త వెనుకబడింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తుండటంతో పోటీ చేసేందుకు సీనియర్లు సైతం జంకుతున్నారు.
ఒకవేళ పోటీ చేస్తే.. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలంటూ సదరు నేతలు అధినేత కేసీఆర్‌కు సూచనాప్రాయంగా తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీనియర్ నేతలతో ఇవాళ గులాబీ బాస్ తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. కాగా, కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరును ఇప్పటికే ఖరారు చేస్తున్నట్లుగా పార్టీలోని ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. ఇక పెద్దపల్లి నుంచి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును కేసీఆర్ ఫైనల్ చేయబోతున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఇతర స్థానాలకు కూడా ఎంపీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించనుందని టాక్.