- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLA: కోదండరాంకు విద్యాశాఖ కేటాయించాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: విద్యాశాఖ(Department of Education) మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) ఉండటం దుర్మార్గమని బీఆర్ఎస్(BRS) నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagdish Reddy) విమర్శలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను పదే పదే అసెంబ్లీకి రావాలని పిలుస్తున్నారు.. వస్తే చెప్పుకోవడానికైనా ఏదైనా అభివృద్ధి చేయండి అని సూచించారు. కేసీఆర్ హాయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాలను(Mount Everest) అధిరోహించారని గుర్తుచేశారు. లగచర్లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.. గురుకుల విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్నా అడ్డుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు అని ప్రశ్నించారు. స్కూలు పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుభరోసా లేదు, దళిబంధు లేదు, బోనస్ అసలే లేదు. కాంగ్రెస్ పాలనపై అందరూ నిరాశలో ఉన్నారని అన్నారు. వడ్ల కొనుగోలుపై ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదని తెలిపారు.
కాంగ్రెస్(Congress) పాలనలో పోలీసులకు తప్పా ఏ శాఖకూ పనిలేదని సెటైర్ వేశారు. బూటకపు ఎన్ కౌంటర్లు ఎక్కడా జరిగినా తప్పే. కేసీఆర్ హయాంలో ఒక ఎన్ కౌంటర్ జరిగితే పొలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకున్నారని గుర్తుచేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్‌కౌంటర్ల పేరిట 14 మందిని పొట్టనబెట్టుకున్నారని అన్నారు. ఎన్కౌంటర్‌పై కచ్చితంగా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధాన కారణమని అన్నారు. కీలకమైన విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం దుర్మార్గమని అన్నారు. కనీసం కోదండరాం(Kodandaram) కైనా విద్యాశాఖను కేటాయించాలని డిమాండ్ చేశారు.