- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS ఎమ్మెల్యే కీలక ప్రకటన

దిశ, వెబ్డెస్క్: నిండు అసెంబ్లీ(Telangana Assembly)లోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ‘తోడ్కలు తీస్తా బట్టలూడదీసి కొడతా’ అంటే ఆయనపై ఎవరు కేసు పెట్టాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekananda) ప్రశ్నించారు. శనివారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో పస లేదు. సభలో దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చేసిన అభివృద్ధి లేదు కాబట్టి.. తరచూ కుటుంబంపైనే మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని అనే సంగతి మర్చిపోయి.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకునే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు చక్కటి పరిపాలనా చేసిన వ్యక్తి కేసీఆర్(KCR).. ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజల్లో కేసీఆర్ ఉన్నారు.. అలాంటి వ్యక్తిపై ఇష్టానుసారం మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.
ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్పై మాట్లాడే ముందు ఒక సారి ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ లేకపొతే నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని అడిగారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన మహానీయుడు అని కొనియాడారు. గవర్నర్ ప్రసంగంతో సంబంధం లేని విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. దుబాయ్లో ఎవరో చనిపోతే బీఆర్ఎస్కు ఏం సంబంధం అని అడిగారు. సీఎం అయ్యాక.. దాదాపు 40 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యాశాఖ భ్రష్టు పడింది.. సీఎం తీరు నచ్చక పరిశ్రమలు తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయి.. సొంత పార్టీ ఎమ్మెల్యే లే రేవంత్ తీరును తప్పు పడుతున్నారు అని తెలిపారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందనే సంగతి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లిని మార్చుతామని కీలక ప్రకటన చేశారు.
READ MORE ...
ప్రజాగ్రహాన్ని జర్నలిస్టుల పైకి నెడితే ఎలా రేవంత్..? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్