- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ శుక్రవారం గన్ పార్క్ వద్ద వారు చేపట్టిన ధర్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజులు ఏమార్చలేరని అన్నారు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దమ్ముంటే అశోక్‌నగర్‌కు రావాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అక్కడ ఉన్న నిరుద్యోగులతో చెప్పించాలన్నారు. అలా చేస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాలు విసిరారు.