- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Vivekananda: ఆ డబ్బు ఏమైనా CM రేవంత్ తాతదా..? ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు కాంగ్రెస్‌ను వదిలి పెట్టరు.. ముందుంది ఆ పార్టీకి మొసళ్ల పండగ అని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రుణ మాఫీపై సీఎం రేవంత్ దేవుండ్లపై ఒట్టు వేసి వాటిని నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారన్నారు. పైసా పైసా కూడబెట్టాం.. నిద్ర లేని రాత్రులు రుణ మాఫీ కోసం గడిపాం అని సీఎం అంటున్నారని, అంత కష్టపడి కూడబెడితే వంద కోట్ల రూపాయలు ప్రకటనలకు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రకటనల కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని రేవంత్ ఆరోపించి ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు రేవంత్ తాతదా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బౌరంపేట ప్రాథమిక సొసైటీలో ఆరు వందల మంది ఉంటే అందులో 5 వందల మంది లక్ష లోపు రుణ మాఫీకి అర్హులు.. మాఫీ అయింది 11 మందికి మాత్రమే అన్నారు. దూలపల్లి సొసైటీలో కూడా చాలా తక్కువ మందికే రుణ మాఫీ వర్తించిందన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలతో రేవంత్ మోసం చేశారని, ఇప్పుడు సీఎం పదవిలోనూ అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొంతే చేసి ఎలా సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని, వాటిపై ప్రజలు నిలదీస్తూనే ఉంటారన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయన ఏం చేశారో రైతులకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.