- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో పదికి పది గెలుస్తాం.. పొంగులేటి ప్రభావం ఉండదు: రేగా
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని క్లీన్ స్లీప్ చేసి చరిత్ర సృష్టిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగాకాంతారావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంతో పాటు రాష్ట్రంలోనూ పటిష్టంగా మారిందన్నారు. బీఆర్ఎస్ఎల్పీలో సోమవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. సీతారామ, సీతమ్మ బ్యారేజీ, రెండు మెడికల్ కాలేజీలు, రెండు కలెక్టరేట్ల నిర్మాణం, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజాసంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. త్వరలోనే పోడుభూములకు పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ప్రజాసంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ట్రైబల్ గ్రామంతో ప్రభుత్వానికి అటాచ్ మెంట్ ఉందన్నారు. 60 ఏళ్లలో సాధించిన లక్ష్యాలను 9 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలోనే సాధించామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగువిస్తీర్ణం పెరిగిందన్నారు.
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఉండదని, ఆయన ఇచ్చే డబ్బులకు ఖమ్మం ప్రజలు అమ్ముడుపోరని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, అందుకే బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని వెల్లడించారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు జనాల నుంచి స్పందన కరువైందని విమర్శించారు. ఆయన ప్రభావం ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్‌చార్జీగా వ్యవహరించిన ఆయన ఎన్ని స్థానాలను గెలిపించుకున్నారని ప్రశ్నించారు. పొంగులేటి గెలిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కలేనన్నారు. రేవంత్‌ను ఆపార్టీ నేతలనే నమ్మడం లేదని అలాంటప్పుడు ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభావం ఉండదని, ఆపార్టీకి 10వేల ఓట్లుకూడా రావన్నారు. కేసీఆర్‌తోనే భరోసా అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read..