- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ నోటీసులపై పైలెట్ రోహిత్ రెడ్డి అనూహ్య నిర్ణయం!
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు డ్రగ్స్ కేసు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసులో తనకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తనకు ఈడీ నోటీసులు అందాయని చెప్పారు. తనకు అందిన నోటీసుల్లో కేసు వివరాలు లేవని అయితే 19వ తేదీన తన ఆధార్, ఓటర్ ఐడీతో రావాలని పేర్కొన్నట్టు చెప్పారు. కేసు వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసులపై లీగల్ టీంతో పరిశీలించాల్సి ఉందని, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నోటీసులపై స్పందిస్తాన్నారు. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో తన లాయర్‌తో రోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈడీ సమన్లు, అందులోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాగా 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారంపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. కేసు వివరాలు లేకుండా నోటీసులు వచ్చాయని పైలట్ చెప్పడం ఆసక్తిగా మారింది. దీంతో ఈ కేసులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
Minister Harish Rao: 4 రోజుల ముందే బండి సంజయ్‌కి ఆ విషయం ఎలా తెలుసు..?