చంద్రబాబుకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

by Javid Pasha |   ( Updated:2023-09-17 15:24:22.0  )
చంద్రబాబుకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన నిరసనల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా వనస్థలిపురంలో ఆయన అభిమానులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.

ర్యాలీలో నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనామా సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభం అవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ర్యాలీ సుధీర్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలవగా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచే ఆయనకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది.

Advertisement

Next Story