- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్యాస్ ధరలు పెంచాల్సిందే.. BRS ఎమ్మెల్యే టంగ్ స్లిప్! (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేస్తున్న వేళ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం గ్యాస్ ధరలు పెంచాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంలో మహిళలంతా చైతన్యంతో ఉన్నారని గ్యాస్ ధరలు పెంచడం కోసం అవసరం అయితే ఢిల్లీకైనా వెళ్దాం అని అంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మిగతా పార్టీ నేతలంతా గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తుంటే ఈ ఒక్క ఎమ్మెల్యే మాత్రం గ్యాస్ ధరలు పెంచాలని డిమాండ్ చేయడం వెనుక ఆసలు ట్విస్ట్ ఉంది.
గ్యాస్ ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆలేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహిళలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టంగ్ స్లిప్ అయ్యారు. గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే అనబోయి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతే కాదు గ్యాస్ ధరల పెంపు కోసం ఎంతదూరం అయినా వెళ్లాల్సిందే అని మాట్లాడారు. అవసరం అనుకుంటే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేయాల్సిందే అంటూ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
గ్యాస్ ధరలు పెంచాలి..అందుకొరకు అవసరమైతే ఢిల్లీ పోతం - గొంగిడి సునిత (ఆలేర్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ) pic.twitter.com/YUgtKmnkms
— Bjp Jangaon Dist (@BJP_Jangaon) March 4, 2023