కేంద్ర మంత్రులతో భట్టి విక్రమార్క భేటీ.. ఆ పథకంపై కీలక కీలక ప్రతిపాదన

by Prasad Jukanti |   ( Updated:2024-03-07 12:06:24.0  )
కేంద్ర మంత్రులతో భట్టి విక్రమార్క భేటీ.. ఆ పథకంపై కీలక కీలక ప్రతిపాదన
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచన జ్ఞానాన్ని కూడా కాల్పోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో గతేడాది వర్షాలు తక్కువగా పడటం వల్లే నీటి కొరత ఏర్పడిందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణలో వర్షాపాతం ఎక్కువ నమోదు అయినా హైదరాబాద్ కు నీటిసరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని బీఆర్ఎస్ నేతలు విర్శలపై కౌంటర్ వేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆర్కే సింగ్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి బొగ్గు గనులు, స్కీమ్.. పీఎం సూర్య్‌ఘర్- ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో వర్చువల్ మిటరింగ్స్ విధానం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు చెప్పారు.

మేడిగడ్డలో మూడు ఫిల్లర్లే కూలాయని వాటిని రిపేర్ చేసి నీటిని ఎత్తిపోస్తే నీటి సమస్య తీరుతుందని కేటీఆర్ చెప్పడానికి ఆయనేమి ఇంజినీరు కాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ వారికి వారే ఎక్కువగా ఊహించుకుని వారే ఇంజినీర్లుగా మారి ప్రాజెక్టులు కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇంజినీరింగ్ నిపుణలు చెప్పే సూచనల ప్రకారమే నడుచుకుంటామన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటంగ్ అనేది ఎప్పుడు జరిగే ప్రక్రియే అన్నారు. బీజేపీ తొలిజాబితాపై స్పందిస్తూ తమది ఓల్డెస్ట్ పార్టీ అని అభ్యర్థులను ఎప్పుడు, ఎలా ప్రకటించాలో మా పార్టీకి తెలుసన్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో తాము వెనుకబడిపోలేదని టైమ్ కు ప్రకటిస్తామన్నారు. ఎవరో ఒకరు ముందు అనౌన్స్ చేశారని మేము నిర్ణయాలు తీసుకోమన్నారు.

Advertisement

Next Story

Most Viewed