- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భేషజాలకు పోకుండా సహకరించండి.. మంత్రి పొన్నంను కలిసి రిక్వెస్ట్ చేసిన రాకేష్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 46ను రద్దు చేసి గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను జీవో46 బాధితులతో కలిశారు. జీవోతో కలుగుతున్న నష్టంను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 46ను రద్దు చేయడం, న్యూమరికల్ పోస్ట్‌లతో న్యాయం చేయడంపై సమాలోచన చేయాలన్నారు. ఈ జీవోతో గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, శాసన సభ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున చొరవచూపాలని మంత్రి పొన్నంను కోరారు.
మంత్రి సైతం సానుకూలంగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారని, శాసన సభ సబ్ కమిటీలో చర్చిస్తామని చెప్పారన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మళ్లీ వచ్చి సవివరంగా వివరిస్తామని, సాంకేతిక సమస్యల పై సమాలోచన చేయడానికి సిద్ధమని, ఎటువంటి పత్రాలు సమకూర్చడానికి అయిన సిద్ధమని పేర్కొన్నారు. ఈ నెల 19 జీవో 46 పై హైకోర్టులో జరిగే విచారణకు ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.