KTR Offer : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్!

by Ramesh N |   ( Updated:2024-10-18 12:45:15.0  )
KTR Offer : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కసాబ్ ఎవరనేది ప్రజలు తెలుస్తారు.. కానీ రేవంత్‌రెడ్డి ‘రెజువెనేషన్’ అనే పదం పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెప్తే బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పారు. స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షల రూపాయలు పట్టే కొత్త బ్యాగ్ కొనిస్తా అని ప్రకటించారు. ఎందుకంటే సీఎం రేవంత్‌కి బ్యాగులు అవసరమని, ఢిల్లీకి డబ్బులు మోయాలి కాబట్టి మాపార్టీ తరపున గిఫ్ట్‌గా పంపిస్తానని సెటైర్లు వేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మూసీ శుద్ధిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని, ఢిల్లీకి‌ మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని విరమ్శించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని చెప్పారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ అని, మూసీపై ప్రభుత్వం అసలు సర్వేనే చేయలేదన్నారు. మూసీ రివర్‌పై గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని అన్నారు.

మూసీ సుందరీకరణ చేయాలంటే లక్ష మంది నిరాశయులవుతారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నామన్నారు. లక్షల మంది పొట్ట కొట్టదని కేసీఆర్ సూచించారని, ఇమ్లిబన్ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ లోనే ఉన్నాయన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ వలనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని ఈటల రాజేందర్ కూడా అన్నారని తెలిపారు. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదేనని తీవ్ర విమర్శలు చేశారు. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మానవీయ కోణంలో మూసీని శుద్ధి చేయాలనుకున్నామన్నారు. పేదల ఇల్లు కొట్టాలని మేము అనుకోలేదని, ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్గొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలని సూచించారు.


👉Also Read : BRS: ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా?

Advertisement

Next Story

Most Viewed