Tokyo Marathon 2025: టోక్యో‌ మేజర్ మారథాన్‌‌లో బీఆర్ఎస్ నేతకు మెడల్..

by Ramesh N |
Tokyo Marathon 2025: టోక్యో‌ మేజర్ మారథాన్‌‌లో బీఆర్ఎస్ నేతకు మెడల్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: జపాన్‌ రాజధాని టోక్యోలో మేజర్ మారథాన్ క్రీడా కార్యక్రమం జరుగుతోంది. ఇందులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణి, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మారథాన్‌లో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన మేజర్ మారథాన్‌‌లో పాల్గొని పూర్తి చేశారు. దీంతో ఆమెకు ఓ మెడల్ వరించింది. ఇప్పటి వరకు ఆమె 6 మేజర్ మారథాన్‌లను కూడా పూర్తి చేసింది. బోస్టన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్, లండన్, తాజాగా టోక్యోలో మారథాన్‌లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story

Most Viewed