BRS: తెలంగాణ భవన్‌కు కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ!

by Ramesh Goud |
BRS: తెలంగాణ భవన్‌కు కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ!
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం(New Year) సందర్భంగా మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. కేటీఆర్ రేపు తెలంగాణ భవన్(Telangana Bhavan) లో అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జనవరి 01న ఉదయం 10:30 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారు. తెలంగాణ భవన్ లో జరిగే న్యూఇయర్ వేడుకలలో(New Year Celebrations) పాల్గొననున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కొత్త సంవత్సరం క్యాలెండర్(BRS Party Calender) ను ఆవిష్కరించనున్నారు. తర్వాత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అంతేగాక బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. తదనంతరం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed