- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: రిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. బీఆర్ఎస్ లీగల్ టీం

దిశ, వెబ్ డెస్క్: కౌశిక్ రెడ్డిని తిప్పి తిప్పి హైడ్రామా చేశారని, రిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ లీగల్ టీం(BRS Leagal Team) మెంబర్ చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం(Narimnagar Collector Office)లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy)ని కరీంనగర్ పోలీసులు(Karimnagar Police) అరెస్ట్(Arrest) చేశారు. దీనిపై కౌశిక్ రెడ్డి తరుపున వచ్చిన లీగల్ టీం మీడియాతో మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డిని మొదట ట్రైనింగ్ సెంటర్ కు తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారని, తిప్పి, తిప్పి ఒక హైడ్రామా క్రియేట్ చేశారని అన్నారు.
అర్థరాత్రి దాటాక ఒంటిగంటకు కౌశిక్ రెడ్డి అరెస్ట్ చూపించి, లీగల్ టీం సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆయనను రెండు కేసుల్లో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారని, ఒకటి ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదును క్లబ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ రెండు కేసుల్లో బెయిల్ రావాల్సి ఉన్నదని, ఈ లోపు రిమాండ్ షీట్ లో ఇంకేమైనా మారుస్తారా తెలీదని అన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే 41 సీఆర్పీసీకి విరుద్దంగా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించిందని, వైద్య పరీక్షలు కూడా స్టేషన్ లోనే చేశారని తెలిపారు. ఇంకో గంట రెండు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామని పోలీసులు చెబుతున్నారని అన్నారు.