- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BRS: రాహుల్ గాంధీ చెప్పింది ఇదేనా?.. కేటీఆర్ పై దాడి పట్ల స్పందించిన హరీష్ రావు
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ మీరు చెప్పింది ఇదేనా అని, ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే ప్రజా పాలనా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. కేటీఆర్ కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన దాడి జరగడం పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "ద్వేషం అనే మార్కెట్ లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను" అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ మీరు చెప్పిన ప్రేమ దుకాణం ఇదేనా అని అడిగారు. అలాగే మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ పై జరిగిన కాంగ్రెస్ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని మండిపడ్డారు.
ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ డీజీపీని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ను అంబర్ పేట ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడమే గాక.. తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులపై బీఆర్ఎస్ నేతలు చేసిన దాడిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.