- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలక సమయంలో BRS గప్ చుప్.. క్యాడర్‌లో గుబులు రేపుతోన్న హైకమాండ్ సైలెన్స్!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సైలెంట్ అయింది. కేవలం కేసీఆర్ సభలు, సమావేశాలప్పుడు హడావిడి తప్ప పార్టీ కార్యక్రమాలు ల్లేవ్. ఎమ్మెల్యేలు కేవలం వివిధ పథకాల కింద మంజూరైన చెక్కుల పంపిణీ చేసేందుకు మాత్రం ప్రజల వద్దకు వెళ్తున్నారు. బీజేపీ కార్నర్ మీటింగ్స్‌తో దూకుడు పెంచగా, 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' పేరుతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. రెండు ప్రధాన పక్షాలు కేడర్‌తో మమేకమవుతూ జోష్ నింపుతున్నాయి. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో రాష్ట్రంలో పార్టీ యాక్టీవిటీస్ తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న అధికార పార్టీ కార్యక్రమాలు మాత్రం అడపాదడపా నిర్వహిస్తుంది. పార్టీ కార్యక్రమాలు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్దత నెలకొంది. బీఆర్ఎస్ తొలిసభను గత నెలలో ఖమ్మంలో కేసీఆర్ నిర్వహించి కేడర్‌లో కొంత జోష్ నింపారు. ఈ నెల 5న ఇతర రాష్ట్రాల్లో నాందేడులో మొదటి సభ నిర్వహించారు. ఈ రెండు సభలు మినహా పార్టీ కార్యక్రమాలు ల్లేవ్. కేవలం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి మంజూరైన కల్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ లాంటి చెక్కులు మాత్రమే పంపిణీ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఎప్పుడో ఒకటి అభివృద్ధి పేరిట పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలు మాత్రం చేపట్టడం లేదు. పార్టీ శ్రేణులకు ఎలాంటి కార్యక్రమాలు ఇవ్వకపోవడంతో గ్రామస్థాయిలో స్తబ్దుగా ఉంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. జిల్లాలో పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ విధివిధానాలు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ప్రణాళిక ఇస్తామని చెప్పిన అధిష్టానం ఆదిశగా అడుగులు వేయలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రలు చేపట్టారు. అంతేకాదు ఈ నెల 10 నుంచి 'ప్రజా గోస-బీజేపీ భరోసా' పేరుతో ప్రతీ రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంగడుతూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో ప్రజల్లో నిత్యం ఉంటుంది. పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. గ్రామీణ స్తాయిల్లో బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది.
కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర పార్టీ ప్రయత్నాలు షురూ చేసింది. అందులో భాగంగానే ఈనెల 6న ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి హాత్‌సేహాత్ జోడో యాత్రను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు ముందే యాత్రను చేపట్టడంతో ఆంక్షలు లేకుండా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను తనదైన శైలీలో రేవంత్ విమర్శిస్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ప్రజలకు గత కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందనే భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్‌గా ఉంది. కాంగ్రెస్, బీజేపీలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ప్రజాసంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఉంది. రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆపార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనులు చేయకపోవడంతో వ్యతిరేకత ఉంది. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలు సైతం లేకపోవడంతో పార్టీ కేడర్‌లో సైతం స్తబ్దత నెలకొంది.