- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ 10 వేల మందితో BRS భారీ స్కెచ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం దిశగా వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆనవాళ్లను చేరిపివేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నాంలో కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వం చేరిపివేస్తామంటోందని మండిపడ్డారు. అలాగే కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా..? అని ప్రశ్నించారు.
ఇక, 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందన్న కర్నె.. ఈ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారని చెప్పారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వరకు పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 2న జాతీయ జెండా, పార్టీ జెండాను తెలంగాణ భవన్‌లో ఎగురవేస్తామని, అనంతరం భవన్‌లో సమావేశం, ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని వెల్లడించారు. జూన్ 3న జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఎగురవేస్తారని చెప్పారు. ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.