- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే.. గత ప్రభుత్వ ఉద్యోగాలపై బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాబీతాను పోస్ట్ చేసింది. హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్‌లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.. అని బీఆర్ఎస్ పేర్కొంది.
తరతరాలుగా మన కొలువులను కొల్లగొట్టిన తీరుకు కేసీఆర్ సర్కారు శాశ్వతంగా చరమగీతం పాడిందని తెలిపింది. మన కొలువులు మన బిడ్డలే దక్కించుకునేలా ఎన్నో సంస్కరణలు, మార్పులు చేసిందని వెల్లడించింది. పదేళ్లలో 2 లక్షల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేశామని, పటిష్టమైన విధానాలను రూపొందించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకే కొలువులు దక్కేలా చేసిందని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది.