200 రోజుల్లో 30 వేల కోట్ల అప్పు! కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-06-26 09:48:02.0  )
200 రోజుల్లో 30 వేల కోట్ల అప్పు! కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 200 రోజుల పాలనలో 30 వేల కోట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రేవంత్ సర్కార్ అప్పులపై ట్విట్టర్ వేదికగా పోస్టులు చేసింది. తెలంగాణను అప్పుల కుప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుందని పేర్కొంది. కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు.. పెద్ద పథకం అమలు లేదు. అయినా రోజుకు 150 కోట్ల చొప్పున అప్పులు చేస్తూ గత ఆరున్నర నెలల్లోనే 30 వేల కోట్ల అప్పులు కాంగ్రెస్ సర్కార్ చేసిందని ఆరోపించింది.

అలాగే రేవంత్ ప్రభుత్వం అప్పులైతే చేస్తున్నారు కానీ.. హామీల అమలులేదు, అభివృద్ధి పనులు లేవని విమర్శించింది. తెచ్చిన వేలకోట్ల రూపాయల అప్పును ప్రజలకు చేరకుండా తింటూ.. పచ్చగున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని పైర్ అయింది. ఈ క్రమంలోనే అప్పులపై మూగబోయిన సూడో మేధావులు అంటూ టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఫోటోలతో ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేసింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ అప్పులకు ప్రభుత్వం వడ్డీలు కడుతున్నదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed