BRS: పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన.. టికెట్ ధరలపై హరీష్ రావు

by Ramesh Goud |
BRS: పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన.. టికెట్ ధరలపై హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పండుగ వేళ బస్సు టికెట్ ధరలు పెంచడం దుర్మార్గమని, ప్రజా పాలన అంటే పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై స్పందించిన ఆయన.. పెంచిన ధరలతో కూడిన టికెట్‌లను ట్వట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు.

టికెట్ ధర రూ.140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. అలాగే హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ.300 ఉంటే, పండుగ వేళ ప్రభుత్వం పెంచిన చార్జీ రూ.420 గా ఉన్నదని తెలిపారు. ఇక బస్సుల సంఖ్య పెంచకుండా, టెకెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన అని ముఖ్యమంత్రిని హరీష్ రావు ప్రశ్నించారు.







Advertisement

Next Story

Most Viewed