- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. ప్రధాన ఎజెండా అదే..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంను నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటీవ్, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దేశంలో, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ కార్యచరణతో పలు సంక్షేమ, అభివృద్ధిపై కూడా చర్చించనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణను కేసీఆర్ ప్రకటించనున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించనున్నారు. అదే విధంగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, ఒక వేళ అరెస్టు చేస్తే చేపట్టబోయే ప్రణాళిలను చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్లాలనేదే ప్రధాన ఎజెండాగా సమావేశంలో సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర విధానాలను ఎలా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే అంశాన్ని కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.