BRS: కాంగ్రెస్ నాయకులకు సీఎంను నిలదీసే దమ్ముందా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్

by Ramesh Goud |
BRS: కాంగ్రెస్ నాయకులకు సీఎంను నిలదీసే దమ్ముందా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నాయకులకు(Congress leaders) దమ్ముంటే విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని నిలదీయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) సవాల్(Challenge) విసిరారు. జగిత్యాల(Jagithyala) వ్యవసాయ కళాశాల(Agricultural College) అడ్మిషన్లపై(Admissions) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్ల సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్న జగిత్యాల వ్యవసాయ కళాశాలలో ఇంత వరకు అడ్మిషన్లు మొదలు కాలేదని ఆరోపించారు.

ఇది నవంబర్ నెల! అంటూ.. ఏమన్న సోయి ఉన్నదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? అని మండిపడ్డారు. కేటీఆర్ గురుకుల బాట అని పిలుపునివ్వగానే మొద్దు నిద్ర వదలి సీయం ఇచ్చిన పచ్చి అబద్ధాల స్క్రిప్టును గాంధీ భవన్(Gandhi Bhavan) లో వల్లె వేస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ మీద విషం చిమ్ముతున్న ఓ కాంగ్రెస్ దద్దమ్మలూ.. మీకు నిజంగా ధమ్ము ఉంటే రేవంత్ రెడ్డిని నిలదీసి విద్యార్థులకు న్యాయం చేయండి.. అప్పుడు వింటాం మీ మాటల్ని అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story