- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టడీ అవర్ కు ఆలస్యమయ్యారని విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్..
దిశ, కొండపాక : విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థుల పై విరుచుక పడ్డాడు. ఆలస్యంగా నిద్రలేచారని స్టడీ అవర్ కు ఆలస్యంగా వచ్చారని ఊగిపోయి దొరికిన వారిని దొరికినట్టుగా కట్టెలతో చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే కొండపాక మండలం దుద్దెడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ తో పాటు పదో తరగతి విద్యార్థులకు ఉదయం స్టడీ అవర్స్ కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 6 గంటలకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. అందులో భాగంగా విద్యార్థులను వాచ్ మెన్ భరత్ ఐదు గంటల 20 నిమిషాలకు వచ్చి విద్యార్థులను నిద్ర లేపాడు. ఆలస్యమైందని విద్యార్థులంతా స్నానానికి వెళ్లారు, కొంతమంది గదిలోనే ఉన్నారు. విద్యార్థులు రావడం ఆలస్యమైందని పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వాసు కోపంతో ఊగిపోయి స్పెషల్ క్లాస్ కు వెళ్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను, పదో తరగతి విద్యార్థులను వరుసగా నిలబెట్టి దొడ్డు కర్రలతో పిరుదులపై, చేతులపై చితకబాదాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థులను, పదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులను కర్రలతో చితకబాదాడు.
అందరి విద్యార్థులకు పెద్దపెద్ద వాతలు వచ్చాయి. కూర్చోవడం కూడా కష్టంగా ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 20 మందిలో హర్షవర్ధన్ అజయ్ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అజయ్ ని సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స చేయించినట్టు సమాచారం. హర్షవర్ధన్ అనే విద్యార్థి హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన వాడు. తీవ్ర గాయాలకు గురైన హర్షవర్ధన్ తట్టుకోలేక ఈ విషయాన్ని రామంతపూర్ లో ఉంటున్న సాంబయ్య రజితలకు సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులను బాదినట్టుగా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. పిల్లలను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్ ను దొడ్డు కర్రలను తీసుకువచ్చిన వాచ్ మెన్ భరత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుమారుని పై వాతలు చూసిన హర్షవర్ధన్ తల్లి కంటతడి పెట్టింది. తప్పు చేస్తే మందలివ్వాలి కానీ పశువులను బాదినట్టు కొట్టడం ఎంటి అని ప్రశ్నించింది. ఈ విషయంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ మాట్లాడుతూ సంఘటన విషయమై సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు తెలిపాడు.