- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుపతిలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. శుక్రవారం నుంచి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం నుంచే టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. తిరుపతిలోని 9 సెంటర్ల వద్ద టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్ల వద్ద భారీగా వేచి ఉన్నారు. అయితే అనూహ్యంగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాటలో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనతో తిరుపతిలో గందరగోళం నెలకొంది.