ఆ విషయంలో BRS, కాంగ్రెస్ సేమ్ టు సేమ్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
ఆ విషయంలో BRS, కాంగ్రెస్ సేమ్ టు సేమ్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధానిగా ఉంటేనే.. దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోడీ పాలనలో ఉగ్రవాద దాడులు లేవు అని తెలిపారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి 11 సీట్లలో విజయవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

మోడీ ప్రధానిగా ఉంటేనే.. దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోడీ పాలనలో ఉగ్రవాద దాడులు లేవన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిర్మించామన్నారు. మోడీ పాలనలో దేశంలో ఉగ్రవాద దాడులు లేవన్నారు. తెలంగాణకు సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశామన్నారు.

తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉందన్నారు. మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు తొలగించి బీసీలకు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా అమలు కావడం లేదన్నారు. మహిళలకు రూ.2500 ప్రతి నెలా ఇస్తామన్నారు... అదీ లేదని మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షలు ఇస్తామని ఇవ్వలేదని తెలిపారు.

Advertisement

Next Story