- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TWEET WAR: రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ వార్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మరోసారి ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా మా రేవంతన్న రుణమాఫీ చేస్తాడు.. రైతుల నమ్మకం ఇది అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ‘ఎలా చేస్తాడు..? నిధులెలా తెస్తారు? ఆర్బీఐ ఒప్పుకోవాలిగా? మోడీ పర్మిషన్ ఇవ్వడు? భూములు అమ్ముతారా? మాకు ఆర్థం కావడం లేదు..! చెప్పండి. ఇది బీఆర్ఎస్ నేతల అనుమానం ‘‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే పెళ్లి కూతురు ముండమోసింది’’ అన్నాడట. పింకీలు.. మీకు, రైతులకు రుణమాఫీ కావాలా.. నిధులెలా తెస్తామన్నది కావాలా’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కరెంటు ఇవ్వడం కూడా చేతకాని పార్టీ మీది, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాం అని, ఎగనామం పెట్టిన పార్టీ మీది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేని పార్టీ మీది. రైతు భరోసా, పెన్షన్లు, జీతాలు ఒకటో తారీఖుకి ఇస్తున్నాం అని అబద్ధాలు చెప్తున్న పార్టీ మీది, జనాలని అన్ని విధాలుగా మోసం చేసిన పార్టీ మీది, మీరు రైతు రుణమాఫీ ఎలా చేస్తారు అని అడగడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత, మీరు ఇచ్చిన 420 దొంగ హామీలు అమలు చేసే వరకు అడుగుతూనే ఉంటాం. ఇలాంటి చిల్లర మాటలు ఆపి.. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి.. అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.