బ్రేకింగ్: సెస్ ఎన్నికల్లో సత్తాచాటిన BRS..

by Satheesh |   ( Updated:2022-12-26 14:08:19.0  )
బ్రేకింగ్: సెస్ ఎన్నికల్లో సత్తాచాటిన BRS..
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలను గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. 15 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన విజయం సాధించడంతో.. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు మొదలుపెట్టారు. సెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సారి సెలక్షన్స్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story