కేంద్ర బడ్జెట్‌పై నోరుమెదపని కేసీఆర్.. కవిత జైల్లో ఉండటమే కారణమా?

by Gantepaka Srikanth |
కేంద్ర బడ్జెట్‌పై నోరుమెదపని కేసీఆర్.. కవిత జైల్లో ఉండటమే కారణమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌పై గులాబీ నేత కేసీఆర్ మౌనం వీడటం లేదు. తెలంగాణకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని రాష్ట్రప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. బడ్జెట్ సెషన్‌లో ఈనెల 24న కేంద్రం చేసిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. అధికార కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం సైతం కేంద్రం వైఖరీని ఖండిం చాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పూర్తిమద్దతు అంటూ కేటీఆర్, హరీశ్ రావు స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవసరం అయితే ఢిల్లీకి అఖిలపక్షంతోపాటు ధర్నా సైతం చేయాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని, బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదంను సైతం ఉచ్ఛరణ చేయలేదని, ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు సైతం కేటాయించలేదని మండిపడుతుంది. ఏపీకి మాత్రం 15వేలకోట్లు కేటాయించిందని, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీలో సైతం బీజేపీ మినహా అన్ని పక్షాలు కేంద్రం తీరును తప్పుబట్టాయి.

వ్యూహాత్మకమా?

కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని, దానిని అనుగుణంగానే మాట్లాడుతారని పార్టీతో పాటు రాజకీయ వర్గాలు భావిస్తాయి. పార్టీకి లోక్‌సభలో ఎంపీలు లేకపోవడమా? లేకుంటే కవిత లిక్కర్ స్కాం ఆరోపణలతో జైలులో ఉండటమా? లేకుంటే బీజేపీని ఎదుర్కోలేమనా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. కేంద్రబడ్జెట్‌పై మాట్లాడితే ఇరుకున పడతామా? లేకుంటే కేంద్రం దృష్టిలో బద్నాం అవుతామని మౌనంగా ఉన్నారా? అనేది పార్టీలోనే చర్చజరుగుతుంది. మరోవైపు కేసీఆర్ బీజేపీకి దగ్గర అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

రాష్ట్ర బడ్జెట్‌పై మాత్రం విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టగా కేసీఆర్ హా జరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, మునుముందు బ్రహ్మాండంగా ఈ బడ్జెట్‌పై చీల్చి చెండాడుతామని తేల్చిచెప్పారు. బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శ‌త్రు వు ప్రభుత్వం అని తేలిపోయింద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింద‌ని మండిపడ్డా రు. అంకెలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప కొత్తగా ఏం లేదన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ అని మండిపడ్డారు. ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీ ఏమిటి..? ఏం లేదు వ‌ట్టిదే గ్యాస్.. ట్రాష్ అని మండిపడ్డారు. కానీ ఇదే మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్ ప్రస్తావన రాకపోవడంపై అధికార కాంగ్రెస్ తో పాటు ప్రజలు సైతం కేసీఆర్ పై మండిపడుతున్నారు. గతంలో కేంద్ర అన్యాయంపై గళమెత్తిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ వెనుక మరమ్మమేంటీ అనేది ఇటు పార్టీలోనూ అటూ రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చజరుగుతుంది.

కేంద్రంపై రాజీలేని పోరాటం అంటూ తీర్మానానికి దూరం

గత పదేళ్లు కేంద్రంపై రాజీలేని పోరాటం చేశామన్న కేసీఆర్ పదేపదే వ్యాఖ్యనిస్తున్నారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించకుండా చేసిన అన్యాయంపై చర్చపెడతామని, తీర్మానం చేస్తామని బీఏసీలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ అధినేతగా, ఎల్ఓపీ(ప్రధాన ప్రతిపక్ష) నేతగా సభకు రాలేదు. చర్చలో పాల్గొనలేదు. కేంద్రంపై చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. కేంద్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంకు నిధులు కేటాయించలేదని, పునర్ విభజన చట్టంలోని హామీలకు నిధులు కేటాయించలేదని దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని పేర్కొంటున్నప్పటికీ కేంద్ర వైఖరీపై కేసీఆర్ నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed