- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS అధినేత కేసీఆర్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో తాను ప్రజల్లోకి వస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గళం బలంగా వినిపించేందుకు కృషి చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్‌పైనే ఉన్నాయని ఎంపీలకు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో మరోసారి చూపిద్దామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మన వెంటే ఉన్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. మరోసారి కరీంనగర్ నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. కరీంనగర్.. కేసీఆర్‌కి సెంటిమెంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి దిగాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.