CESS Elections : వీర్నపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-26 14:29:14.0  )
CESS Elections : వీర్నపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. వీర్నపల్లి మండల సెస్ డైరక్టర్‌గా బీఆర్ఎస్ బలపరిచిన మాడుగుల మల్లేశం సమీప అభ్యర్థి మాలోత్ లక్పతిపై 517 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మాడుగుల మల్లేశం‌ను వీర్నపల్లి మండలం ఎంపీపీ భూక్యా భూలా, జడ్పీటీసీ గగులోత్ కళావతి సురేష్‌లు అభినందించారు.

Advertisement

Next Story