హరీష్ రావును తీసుకెళ్తున్న బస్సును అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. లాఠీచార్జ్

by karthikeya |   ( Updated:2024-09-12 16:11:16.0  )
హరీష్ రావును తీసుకెళ్తున్న బస్సును అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. లాఠీచార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును తీసుకెళుతున్న పోలీస్ కాన్వాయ్‌ని ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. ఈ బస్సులో హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరికొంతమంది కీలక బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులు ముందుకు కదలకుండా ప్రైవేటు వాహనాలను అడ్డుగా పెట్టి అడ్డుకుంటుండగా.. వారిని చెల్లా చెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లాఠీచార్జ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కార్యకర్తలు మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

కాగా.. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదంలో భాగంగా హరీశ్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి వెళ్లి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి తమ తడాఖా చూపిస్తామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. మూడు బస్సుల్లో వారిని తరలించిన పోలీసులు.. ముందుగా శంషాబాద్‌ స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పినా.. ఆ తర్వాత రూటు మార్చి సైబరాబాద్ పరిథిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని చివరి పోలీస్ స్టేషన్ తలకొండపల్లికి తీసుకెళ్లసాగారు. కీలక నేతలను అడ్డుకోగలిగితే శుక్రవారం బీఆర్ఎస్ తలపెట్టిన ఆందోళనలను అడ్డుకోవచ్చని భావించిన పోలీసులు.. దాదాపు 3 గంటల నుంచి హరీశ్ రావుతో సహా మిగిలిన నేతలను బస్సులోనే తిప్పుతూ తలకొండపల్లికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య నేతృత్వంలో 1000 మంది కార్యకర్తలతో బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed